Heroin Sridevi Death News | Actress Sridevi is No More | అతిలోకసుందరి సినీనటి శ్రీదేవి కన్నుమూత

Heroin Sridevi Death News
Heroin Sridevi Death News

Heroin Sridevi Death News, లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి (54) శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. బంధువుల వెడ్డింగ్ నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అయుతే కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు శ్రీదేవి సోదరుడు సంజయ్‌ కపూర్‌ ధ్రువీకరించారు.

సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లినట్లుగా బాలీవుడ్ వర్గాలు ప్రకటించాయి. శ్రీదేవి ఇక లేరు అనే వార్తని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. శ్రీదేవి హార్ట్ ఎటాక్‌తో మరిణించారనే విషయం తెలిసిన బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కి గురయింది.

1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. 1967లో బాలనటిగా సినీరంగంలో ప్రవేశించి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. 1996లో బోనీకపూర్‌తో శ్రీదేవికి వివాహమైంది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. 2013లో భారత ప్రభుత్వం అమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2017లో చివరిగా ‘మామ్‌’ చిత్రంలో నటించారు. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు.

‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’తో ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. చివరిగా ఆమె 2017లో ‘మామ్‌’లో నటించారు.

1975 చిన్నతనంలోనే సినీరంగంలోకి ప్రేవేశించిన శ్రీదేవి.. భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం ‘మా నాన్న నిర్దోషి’. తెలుగు తెరపై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడి అతిలోకసుందరిగా వెలుగొందారు.

దఢక్ చిత్ర షూటింగ్ కారణంగా జాన్వీ కపూర్ వెడ్డింగ్‌కి వెళ్లలేదని సమాచారం. ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జొహార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దడాక్‌’లో నటిస్తోంది.

సోషల్ మీడియా అంతా ఈ వార్త స్ప్రెడ్ అయింది.